Huzurabad By-Election: హుజూరాబాద్‌లో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్

* మధ్యాహ్నం 1గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు * ఓటు హక్కు వినియోగించుకున్న లక్ష 8వేల మంది ఓటర్లు

Shilpa
Published on: 30 Oct 2021 2:04 PM IST
By-Election Polling Continues in Huzurabad
X

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్

Huzurabad By-Election: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. సాయంత్రంలోపు 90శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హుజూరాబాద్‌లో 45.63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక మండలాల వారీగా హుజూరాబాద్‌లో 45.05 శాతం, వీణవంకలో 47.65 శాతం పోలింగ్ నమోదైంది.

అటు జమ్మికుంట మండలంలో 45.36 శాతం, ఇల్లందుకుంటలో 42.09 శాతం, కమలాపూర్‌ మండలంలో 46.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా లక్ష 8వేల 2 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు 52వేల 973 మంది, పురుషులు 55వేల 109 మంది ఓటు వేశారు.

Shilpa

Shilpa

Next Story