Hyderabad: శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన శ్రీధర్‌రావు.. మరుసటి రోజు నుంచి మిస్సింగ్

Businessman Sridhar Rao Is Missing
x

Hyderabad: శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన శ్రీధర్‌రావు.. మరుసటి రోజు నుంచి మిస్సింగ్ 

Highlights

Hyderabad: శంషాబాద్ పోలీసులకు శ్రీధర్‌రావు భార్య ఫిర్యాదు

Hyderabad: హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీధర్ రావు మిస్సింగ్ కలకలం రేపింది. గత నెల 16న స్నేహితులను కలవడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీధర్ రావు ఢిల్లీ వెళ్లాడు. మరుసటి రోజు భార్య శిల్ప ఫోన్ చేయగా... ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులను విచారించగా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కలేదని చెప్పారు. భర్త శ్రీధర్‌రావు కోసం బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. శ్రీధర్‌రావు మిస్సింగ్‌పై శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు శిల్ప ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories