బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం..

బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం..
x
Highlights

బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం..

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి వద్ద ఈ తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్‌ బస్సు దురాజ్‌పల్లి సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులుండగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్షమేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories