బుల్లెట్ బండి ట్రెండింగ్ జోరు.. పక్షవాతం వచ్చిన రోగికి పాటతో ట్రీట్మెంట్

Bullet Bandi Song Used For Treatment  to Paralyzed Patient in Hospital
x

బుల్లెట్ బండి ట్రెండింగ్ జోరు.. పక్షవాతం వచ్చిన రోగికి పాటతో ట్రీట్మెంట్

Highlights

Bullet Bandi Song: కొన్ని పాటలు మనసును దోచేస్తాయ్.. పదే పదే హాంట్ చేస్తాయ్.. వెంటాడతాయి.. వేటాడతాయి.

Bullet Bandi Song: కొన్ని పాటలు మనసును దోచేస్తాయ్.. పదే పదే హాంట్ చేస్తాయ్.. వెంటాడతాయి.. వేటాడతాయి.. ఎక్కడున్నా.. ఎప్పుడైనా హమ్ చేసుకోవాలనిపించేంతలా ఉంటాయి. ప్రత్యేకించి జానపదాలయితే మరీను మైసమ్మో మైసమ్మా పాట, సారంగ దరియా పాట ఎంత హిట్ అయ్యాయో అందరం చూశాం. జానపదాలుగా పాపులర్ అయిన ఆ పాటలు ఆ తర్వాత రూట్ మార్చుకుని ట్రెండ్ మార్చుకుని సినిమా పాటలుగా మారిపోయాయి. ఇప్పటికీ జనం నోళ్లలో నానుతున్నాయి. ఆ పాటలు విన్నా, పాడినా, ఒక ఊపును, ఒక ఉత్సాహాన్ని, ఒకరకమైన హాయినీ కలిగిస్తాయి.

అలాంటి కోవలోకే వస్తుంది బుల్లెట్ బండి సాంగ్. ఈ పాట ఎంత ట్రెండ్ ను సెట్ చేసిందో అందరికీ తెలుసు వాస్తవానికిన ఈ పాట పాడింది మోహన భోగరాజు అయినా సాంగ్ మాస్ లోకి చేరిపోడంతో బాగా ట్రెండింగ్ అయింది. అలా మాస్ లో బాగా పాపులర్ అయిన ఈసాంగ్ ఓ పెళ్లికూతురు డ్యాన్స్ తో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. పెళ్లి తర్వాత బారాత్ ఫంక్షన్ లో పెళ్లికుమార్తె ఈ స్టెప్ప్ వేయడం సోషల్మీడియాను ఓ కుదుపు కుదిపేసింది. క్షణాల్లో వైరల్ గా మారింది. ఈపాటతో పాట పాడిన అసలు సింగర్ కన్నా స్టెప్స్ వేసిన పెళ్లికుమార్తె బాగా పాపులర్ అయిపోయింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే సాంగ్ పాడుకోడం కనిపించింది. పెళ్లిళ్లలో ఇదో ట్రెండ్ గా మారింది. ఫంక్షన్లలో ఇదో తప్పనిసరి ఐటెంగా మారిపోయింది.

బుల్లెట్ బండి సాంగ్ మీద సెటైర్లు కూడా అంతే రేంజ్ లో సాగాయి. జోక్స్, ట్వీట్స్,వైరల్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పీహెచ్ సీలో ఓ నర్సు ఏకంగా ఆస్పత్రిలో ఈ సాంగ్ కు డాన్స్ చేసి ఉద్యోగం రిస్కులో పడేసుకుంది. ఆగస్టు 15న తోటి నర్సులు కోరడంతో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు స్టెప్స్ వేసింది. విధి నిర్వహణలో ఇలా డాన్సుచేయడం ఏంటంటూ పై అధికారులు క్లాస్ పీకినా నర్స్ కు మాత్రం ఓ రేంజ్ లో పాపులారిటీ పెరిగిపోయింది.

తాజాగా బుల్లెట్ బండి సాంగ్ రోగాలను నయం చేసేదిగా కూడా మారిపోయిందా అంటే అవుననే అనాలి. పాట వల్ల వ్యాధులు నయం కాకపోయినా పేషెంట్లలో జోష్ ను నింపుతోంది సాంగ్. ఒక ఉత్సాహాన్ని, బతుకు మీద ఆశను కల్పిస్తోంది. తాజాగా ఈ సాంగ్ ను ఒక థెరపీగా ఆస్పత్రి సిబ్బంది వినియోగించడం వెలుగులోకి వచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఓ పేషెంట్ ట్రీట్ మెంట్ కోసం నర్స్ బుల్లెట్ బండి సాంగ్ ను ప్రయోగించింది. బుల్లెట్ సాంగ్ కు నర్సుతో కలసి ఆ రోగి ఆస్పత్రి బెడ్ పైనే డాన్స్ చేసే ప్రయత్నం చేశాడు. పక్షవాతంతో చచ్చుబడిపోయిన చేతిని సైతం ఈ పాటలో పైకి లేపే ప్రయత్నం చేశాడు. నర్స్ ఇచ్చిన ప్రోత్సాహానికి ఆ రోగి స్పందించిన తీరు ఆస్పత్రి సిబ్బందిని సైతం సంతోషపరచింది.


Show Full Article
Print Article
Next Story
More Stories