Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం..11మంది మృతి

Mumbai: ముంబైలోని మల్వానిలో నాలుగు అంతస్థుల భవనం కూలి 11 మంది మృతి చెందారు.

Kranthi
Updated on: 10 Jun 2021 11:26 AM IST
Building Collapsed in Malvani in Mumbai
X

Building Collapsed in Malvani in Mumbai

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్థలు భవనం కుప్పకూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే....ముంబైలోని మల్వానిలో బుధవారం రాత్రి 11.00 గంటల సమయంలో జరిగింది. ముంబైలో నిన్న భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం కూలిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. స్థానికులు, పోలీసుల సహాయంతో విపత్తు సిబ్బంది శిథిలాల నుంచి 15 మందిని రక్షించారు. గాయపడిన వారిని బీడీబీఏ మునిసిపల్ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 9 మంది మరణించారని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల వల్లే భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సమీప భవనాల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించారు.

Kranthi

Kranthi

Next Story