Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Hyderabad: నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి

Sandeep Eggoju
Published on: 10 Sept 2021 8:03 AM IST
Brutal In Saidabad Singareni Colony Hyderabad
X

Representational Image

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి విగత జీవిగా కనిపించడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాజు నాయక్‌ ఇంట్లో బాలిక శవమై తేలింది. దొంగతనాలకు అలవాటు పడ్డ రాజు భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడ్ని అప్పగించే వరకు కదిలేదిలేదని స్థానికులు బైటాయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story