Telangana: నిజామాబాద్ జిల్లాలో దారుణం
Telangana: మృతదేహాన్ని దహనం చేయకుండా స్మశానవాటికలో వదిలివెళ్లిన వైనం
Representational Image
Telangana: నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రగతినగర్ సర్వజనిక్ స్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయకుండా వదిలివెళ్లిపోయారు. దహన సంస్కారాలకు వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకొచ్చిన వదిలివెళ్లారు ముగ్గురు వ్యక్తులు. మృతదేహాన్ని అక్కడ వదిలి కట్టెలు తీసుకొస్తామని వెళ్లిన వ్యక్తులు తిరిగిరాకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు స్మశానవాటిక వాచ్‌మెన్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్దురాలి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని వదిలివెళ్లిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్న కొడుకే తన తల్లి మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
Next Story




