Harish Rao: ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేది బీఆర్‌ఎస్సే

Harish Rao: ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే గెలిచేది బీఆర్‌ఎస్సేనని అన్నారు మాజీమంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 2:51 PM IST
Harish Rao: ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేది బీఆర్‌ఎస్సే
X

Harish Rao: ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే గెలిచేది బీఆర్‌ఎస్సేనని అన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన సర్పంచులకు హరీష్‌రావు సన్మానం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లకు మించి ఉండదని అన్నారు హరీష్‌రావు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్‌తో ప్రజలకు ఒరిగిందేమిటని ప్రభుత్వంపై హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story