ముగిసిన బీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

* గ్రామగ్రామన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశం

Dhatripriya
Published on: 17 May 2023 5:18 PM IST
BRS Wide Scale Meeting Concluded
X

ముగిసిన బీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

BRS: బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ పలు హాట్ కామెంట్స్‌ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు 105 సీట్లు వస్తాయన్నారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. పదేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని అన్నారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి సభలు పెట్టాలని సూచించారు. చెరువు గట్ల మీద రైతులతో భోజనం చేయాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుపై సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్‌. 70ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని... వారిని ప్రజలు నమ్మరని అన్నారు. ఇక.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై బీఆర్‌ఎస్‌ఎల్పీలో చర్చించిన గులాబీ బాస్.. గ్రామగ్రామన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story