బీఆర్ఎస్‌లో అలజడి సృష్టిస్తోన్న లగచర్ల దాడి కేసు

Lagacharla Incident: బీఆర్ఎస్‌లో లగచర్ల దాడి కేసు అలజడి సృష్టిస్తోంది. రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Nov 2024 10:09 AM IST
BRS Under Danger With Lagacharla Attack Case
X

బీఆర్ఎస్‌లో అలజడి సృష్టిస్తోన్న లగచర్ల దాడి కేసు 

Lagacharla Incident: బీఆర్ఎస్‌లో లగచర్ల దాడి కేసు అలజడి సృష్టిస్తోంది. రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో అర్థరాత్రి ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పలువురు నేతలు, కార్యకర్తలు.

నిన్న రాత్రి కేటీఆర్ నివాసానికి ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేటీఆర్, హరీష్ రావు సమావేశమై.. లగచర్ల ఇష్యూతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్లకు వెళ్ళాలని బీఆర్ఎస్ నేతల బృందం భావిస్తోంది. కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టైన వారి కుటుంబాలను పరామర్శిస్తామంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story