BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్

BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్
x

BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్

Highlights

BRS: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూరంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.

BRS: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూరంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్డీఏ, ఇండీ కూటమిలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశాయన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్‌కు నలుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎన్నికల సమయంలో దూరంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేయనున్నారు.

బీఆర్ఎస్ తాజా నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. బీఆర్ఎస్- బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం ఉండడం పరోక్షంగా బీజేపీకి మేలు చేయడం మాత్రమే అని చెడ్డీలు వేసుకొని రాజకీయాలను టీవీలో చూసే పిల్లవాడికి కూడా తెలుసు అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఇదే బీఆర్ఎస్- బీజేపీ అసలు స్వరూపమని కూడా సామా విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories