Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

Supreme Court: ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Jun 2024 2:10 PM IST
BRS to Move Supreme Court on MLAs Switching Parties
X

Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

Supreme Court: ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ చెబుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది.

ఈనెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్లనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story