Medak: నేడు మెదక్‌ పార్లమెంట్‌పై బీఆర్‌ఎస్‌ సమీక్షా సమావేశం..

BRS Review Meeting On Medak Parliament Today
x

Medak: నేడు మెదక్‌ పార్లమెంట్‌పై బీఆర్‌ఎస్‌ సమీక్షా సమావేశం.. 

Highlights

Medak: ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి మధ్య పోటీ

Medak: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తు్న్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌తో కలిపి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరపనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మెదక్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే.. వేరే అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే మెదక్ ఎంపీ స్థానం కోసం ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ చేసినట్లు టాక్. ఎంపీ టికెట్ ఆశిస్తున్నవారిలో గాలి అనిల్‌కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి రేసులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories