Telangana: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌పై అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Jyothi
Published on: 6 March 2024 12:46 PM IST
BRS Protests across Telangana
X

Telangana: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలకు దిగింది. LRS స్కీంపై అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతోంది. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్ఎస్‌ పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. 25 లక్షల లబ్ధిదారులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసనల్లో పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. మైత్రివనం హెచ్‌ఎండీఏ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టగా.. మాజీ మంత్రి తలసాని హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story