ఎమ్మెల్సీ పల్లాకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం షాక్‌.. మంత్రి ఫోన్‌తో వెనక్కి!

Palla Rajeshwar Reddy: జనగామలో నిర్వహించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుల సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

Arun Chilukuri
Updated on: 8 Sept 2023 7:45 PM IST
BRS MLC Palla Rajeshwar Reddy Janagaon Tour Cancelled
X

ఎమ్మెల్సీ పల్లాకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం షాక్‌.. మంత్రి ఫోన్‌తో వెనక్కి!

Palla Rajeshwar Reddy: జనగామలో నిర్వహించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుల సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. జనగామ శివారులో ‎ఇవాళ తరిగొప్పులు, నర్మెట్ట మండలాలకు చెందిన నేతలు.. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనగామలో పల్లా అభ్యర్థిత్వంపై రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి పల్లా దూరంగా ఉన్నారు. హైదారబాద్ నుంచి జనగామ బయలుదేరిన పల్లా.. అధిష్టానం ఆదేశాలతో మార్గ మధ్యంలోనే తిరుగుప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ రావడంతో పల్లా వెనక్కి మళ్లారు. కార్యకర్తలకు ఫోన్ ద్వారా తన సందేశాన్ని అందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story