MLC Kavitha: ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దీక్ష

MLC Kavitha: ఉ.10 నుంచి సా. 4వరకు జంతర్ మంతర్ వద్ద దీక్ష

Jyothi
Published on: 10 March 2023 7:20 AM IST
BRS MLC Kavitha Deeksha in Delhi today
X

MLC Kavitha: ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దీక్ష

MLC Kavitha: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద BRS ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్ష యథాతథంగా కొనసాగనుంది. ఈ దీక్షకు ఢిల్లీ పోలీసులు మొదట అనుమతి నిరాకరించగా.. వారితో BRS జాగృతి సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో ఇవాళ దీక్షకు జాగృతి నేతలు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపు 6వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి దీక్షలో పాల్గొననున్నారు. కవిత దీక్షకు విపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలుపనున్నారు.

Jyothi

Jyothi

Next Story