Muthireddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Muthireddy:తన కూతురిని పావుగా వాడుకుంటున్నారంటూ ఆవేదన

Shekhar G
Published on: 2 July 2023 7:45 PM IST
BRS MLA Muthireddy Sensational Comments
X

Muthireddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దచెరువు మత్తడి స్థలంలోని 12వందల 70 గజాల స్థలాన్ని తన కూతురు తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాతిస్తున్నట్లు తెలిపారు. తన కూతురిని అడ్డు పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తన కూతురు, అల్లుడు అమాయకులని, వారిని తనపై ఉసిగొల్పేందుకు రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని ముత్తిరెడ్డి ఆరోపణలు చేశారు. తనను నేరుగా ఎదుర్కోలేక తన కూతురిని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని, దమ్ముంటే తనను ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story