తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్‌ లోక్‌సభ సమీక్ష సమావేశం

Telangana Bhavan: నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గంపై ఇవాళ సమీక్ష

Jyothi
Published on: 17 Jan 2024 10:22 AM IST
BRS Lok Sabha Review Meeting today at Telangana Bhavan
X

తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్‌ లోక్‌సభ సమీక్ష సమావేశం

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ లోక్‌సభ సమీక్ష సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. పండగ నేపథ్యంలో మూడు రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తోంది గులాబీ అధిష్టానం. ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు. బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో సమీక్ష జరగనుండగా.. కేకే, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి కీలక నేతలు కూడా హాజరవుతారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీగా రాములు ఉండగా.. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ సారి ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. 13 నియోజకవర్గాల్లో 12 చోట్ల సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థిని మార్చిన అలంపూర్‌లో విజయుడు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అవడంతో.. గెలుపు కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీ రేసులో గువ్వల బాలరాజు టికెట్ ఉండగా.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో నిలిచేందుకు పోటీపడుతున్నారు. బిజెపి బలమైన అభ్యర్థి నిలబెట్టడం కోసం ఆశావాహులను వెతుకుతుంది.

Jyothi

Jyothi

Next Story