Congress: కూతుళ్ల కోసం కాంగ్రెస్‌లో చేరుతోన్న తండ్రులు

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ పార్టీలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 29 March 2024 8:31 PM IST
BRS Leaders Join Congress for Sake of Daughters
X

Congress: కూతుళ్ల కోసం కాంగ్రెస్‌లో చేరుతోన్న తండ్రులు

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ పార్టీలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ‎ఒకరేమో స్వంత భవిష్యత్ కోసం పార్టీ మారుతుంటే.. మరొకరు పదవుల కోసం కండువాలు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని కీలక నేతలంతా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారు. లేటెస్ట్‌గా బీఆర్ఎస్ సీనియర్ నేతలైన కేశవరావు, కడియం శ్రీహరిలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకునే సమయంలో ఈ పార్టీ మారడం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌ అయింది.

అయితే వారు పార్టీ మారేది కూతుర్ల కోసమే అనే చర్చ ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం శ్రీహరి కూతురు కావ్య త్వరలోనే హస్తం పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కూతుర్ల రాజకీయ భవిష్యత్ కోసం తండ్రులు పార్టీ మారుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో వైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ట్రస్ట్ ద్వారా స్టేషన్ ఘనపూర్, వరంగల్ జిల్లాలో పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ కోసమే కడియం శ్రీహరి పార్టీ మారేందుకు రెడీ అయినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story