Padma Devender Reddy: ‎అవినీతి నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్

Padma Devender Reddy: సొంత పార్టీ నేతలు సైతం ఆరోపణలు చేస్తున్నారు

Shekhar G
Published on: 7 Sept 2023 12:52 PM IST
BRS Leader Devender Reddy Takes Oath At Edupayala Temple
X

Padma Devender Reddy: ‎అవినీతి నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్

Padma Devender Reddy: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు బీఆర్ఎస్ నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి. ప్రతిపక్షాలు తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాందాస్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు. సొంత పార్టీ నేతలు సైతం అవినీతి ఆరోపణలు చేయడంతో తన నిజాయితీ నిరూపించేందుకే ప్రమాణం చేశానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈసారి కూడా సీఎం కేసీఆర్ టికెట్ ప్రకటించడంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story