BRS: బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
BRS: మరో మూడు రోజుల్లో నాగర్‌కర్నూల్ నేతలతో సమావేశం
BRS: బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
BRS: బీఆర్ఎస్ పార్టీ మరో అభ్యర్థి పేరును ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీకే అవకాశం ఇచ్చింది. మన్నె శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించినట్టు ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం అయిన కేసీఆర్.. నాగర్‌కర్నూల్ టికెట్ పెండింగ్‌లో ఉంచారు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు నాగర్‌కర్నూల్ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరో మూడు రోజుల్లో నాగర్‌కర్నూల్ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్.. ఆ తర్వాత టికెట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Next Story




