MLC Kavitha: గత ప్రభుత్వాలు గౌడ కులస్థుల పట్ల వివక్షతను చూపాయి
MLC Kavitha: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
MLC Kavitha: గత ప్రభుత్వాలు గౌడ కులస్థుల పట్ల వివక్షతను చూపాయి
MLC Kavitha: నిజామాబాద్ పట్టణంలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కవిత, గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. గీత కార్మిక కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్థుల పట్ల వివక్షతను చూపించాయని ఆమె విమర్శించారు. గత పాలకులు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసివేశారు. కానీ తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తిరిగి ప్రారంభించినట్లు ఆమె అన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Next Story




