BRS: తెలంగాణభవన్‌లో నేడు బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం

BRS: ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్

Dhatripriya
Published on: 27 April 2023 8:05 AM IST
BRS General Meeting Today At Telangana Bhavan
X

BRS: తెలంగాణభవన్‌లో నేడు బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం

BRS: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణభవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. మొత్తం.. 279 మంది ప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది..

టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ కావటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఉద్యమ పార్టీగా, పాలక పార్టీగా గులాబీ పార్టీ ప్రస్థానాన్ని వివరించనున్నారు ఈ నేపథ్యంలో కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉం డే అవకాశాలున్నాయి. అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story