BJP: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

BJP: బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసిన ఆరూరి రమేష్

Shashank Gullapelli
Published on: 12 March 2024 9:11 PM IST
Brs Former Mla Aroori Ramesh Joined Bjp In The Presence Of Amit Shah
X

BJP: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

BJP: వరంగల్ జిల్లా బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డిని కలిశారు ఆరూరి రమేశ్.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో బేగంపేట్ కాకతీయ హోటల్‌‌లో కిషన్‌రెడ్డితో సహా ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో బీజేపీ ముఖ్యనేతలు పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story