BRS Candidates List: 105 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ జాబితా.. 14 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..?

BRS Candidates List: మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత చుట్టూ ప్రదక్షిణలు

Shekhar G
Published on: 21 Aug 2023 10:05 AM IST
BRS First List Likely Today Triggers In Fight In Multiple Seats
X

BRS Candidates List: 105 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ జాబితా.. 14 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..?

BRS Candidates List: గులాబీ దళపతి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. శ్రావణమాసం తొలి సోమవారం.. పంచమితిథి కావడంతో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక ఎవరికి బెర్త్.. ఎవరికి ఎర్త్‌ అనే విషయంపై బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 14 స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. 105 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో మాట్లాడి కీలక అభ్యర్థులను ఫైనల్ చేసి.. అమెరికా వెళ్లారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు గులాబీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో.. మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story