Adi Srinivas: బీఆర్ఎస్ అసెంబ్లీని వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో విఫలమైంది

Adi Srinivas: బీఆర్ఎస్ అసెంబ్లీని వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో విఫలమైంది
x

 Adi Srinivas: బీఆర్ఎస్ అసెంబ్లీని వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో విఫలమైంది

Highlights

Adi Srinivas: తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది.

Adi Srinivas: తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రజా సమస్యలపై చర్చించకుండా బీఆర్ఎస్ నేతలు సభ నుండి పారిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ములేకే వాకౌట్

సభలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంటే, వాటికి పరిష్కారాలు వెతకాల్సింది పోయి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆది శ్రీనివాస్ విమర్శించారు. "సభకు రాని వారికి సభా హక్కుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?" అని ఆయన ప్రశ్నించారు. సభను బహిష్కరించి బయటకు వెళ్లిన వారు, మళ్లీ సభా హక్కుల నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

కృష్ణా జలాల దోపిడీపై సీఎం క్లారిటీ

గత పదేళ్ల కాలంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, బీఆర్ఎస్ చేసిన దోపిడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టారని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన విలన్ బీఆర్ఎస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు.

జగన్, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందాలు?

తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అంతర్గత భాగస్వాములని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. "రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంది రేవంత్ రెడ్డే అని జగన్ స్వయంగా చెప్పినా, బీఆర్ఎస్ నేతలకు మాత్రం అది పట్టడం లేదు. వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు" అని మండిపడ్డారు.

స్పీకర్ పదవికి అవమానం

బీఆర్ఎస్ నేతలు స్పీకర్ చైర్‌ను అవమానించేలా మాట్లాడటంపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు వెల్లడించారు. సభలో నిజాలు బయటపడుతుంటే తట్టుకోలేక, అల్లాడిపోయి వారు బయటకు వెళ్లిపోయారని విమర్శించారు.

కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి

శాసన మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో విఫలమైన బీఆర్ఎస్, కేవలం విమర్శలకే పరిమితమైందని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories