జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు పొటా పోటీగా నినాదాలు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 12:11 PM IST
BRS Corporators Protest In GHMC Council Meeting
X

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు పొటా పోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్లను మేయర్ నివారించారు. పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని కార్పొరేటర్లను నిలదీశారు. మేయర్ రాజీనామా చేయాలని.. పొడియాన్ని చుట్టుముట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో బీఆర్ఎస్‌ కార్పొరేటర్లపై మేయర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్‌ఎస్‌ అంటూ మేయర్ ఫైరయ్యారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story