Prakash Goud: మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా

Prakash Goud: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎంఐఎం నాయకులు

Shekhar G
Published on: 11 Nov 2023 7:45 PM IST
BRS Candidate Prakash Goud Campaign
X

Prakash Goud: మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా

Prakash Goud: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మనమందరం ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని ప్రజలు భావిస్తున్నారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట గ్రామానికి చెందిన పలువురు ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story