Laxman: బీసీలకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది

Laxman: కానీ వారికి బీఆర్ఎస్ అన్యాయం చేసింది

Shekhar G
Published on: 29 Aug 2023 7:35 PM IST
BRS Came To Power With The Promise Of Justice To The BCs Says Laxman
X

Laxman: బీసీలకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది

Laxman: బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ... వారి అభివృద్ధిని గాలికి వదిలేసిందని బీజేపీ ఓబీసీ మొర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. హైదరాబాద్ కొంపల్లిలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలని చెప్పినా... సబ్ ప్లాన్ చట్టాన్ని చట్ట బండలు చేసి, బీసీ బంధు పేరిట కొంత మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం చాలా దారుణమని, అన్ని కులాలు, వర్గాలు అభివృద్ధి చెందేలా అందరికీ బీసీ బంధు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీలకు, ఎస్‌సీలకు సబ్ ప్లాన్ అమలు చేసి, వారి జీవితంలో వెలుగులు నింపాలని మొట్ట మొదట ప్రతిపాదించింది తమ పార్టీ అన్నారాయన... బడుగు బలహీన వర్గాల నుంచి దేశం గర్వించ దగిన స్థాయికి వెళ్లిన బీసీ బిడ్డ నరేంద్ర మోడీ అని బీజేపీ ఓబీసీ మొర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story