BRS: రేపు ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్

BRS: రేపు ఉదయం 8 గంటలకు మేడిగడ్డకు పయనం

Shekhar G
Published on: 29 Feb 2024 6:36 PM IST
BRS Called For Chalo Medigadda Tomorrow
X

BRS: రేపు ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్  

BRS: రేపు ఛలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. రేపు ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మేడిగడ్డ విజిట్ చేసే బృందంలో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాజీ ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని గులాబీ పార్టీ చెబుతోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ అని నేతలు అంటున్నారు. కుంగిన బ్యారేజ్‌కు మరమత్తులు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story