BRS Avirbhava Sabha: రేపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ

BRS Avirbhava Sabha: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు

Dhatripriya
Published on: 17 Jan 2023 9:20 AM IST
BRS Avirbhava Sabha In Khammam Tomorrow
X

BRS Avirbhava Sabha: రేపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ

BRS Avirbhava Sabha: రేపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ జరగనుంది. రఘునాథపాలెం మండలం వి.వెంకటయ్యపాలెం ఈ సభకు వేదికైంది. దీంతో పోరాటాల ఖిల్లా ఖమ్మం గులాబీ మయమైంది. ఫ్లెక్సీలు, తోరణాలు, జెండాలతో నగరం కళకళలాడుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. 100 ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకే ఏర్పాట్లు చకాచకా జరుగతున్నాయి. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు జాతీయ నేతలు చేరుకోనున్నారు. రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి రేపు ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు నలుగురు సీఎంలు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మంలో బీఆర్ఎస్‌ సభకు హాజరుకానున్నారు. సీఎంల పర్యటన నేపథ్యంలో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story