Sri Sathya Sai District: తెగిన రైల్వే విద్యుత్తు తీగ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Sri Sathya Sai District: హిందూపురం రైల్వే స్టేషన్లో ఆగిన లోకమాన్య తిలక్ రైలు

Jyothi
Published on: 21 July 2023 9:06 AM IST
Broken Railway Power Line Interruption of Trains in Sri Sathya Sai District
X

Sri Sathya Sai District: తెగిన రైల్వే విద్యుత్తు తీగ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నుండి పెనుగొండ రైల్వే మార్గంలో పవర్ కేబుల్ తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు విద్యుత్తు సమస్య తలెత్తింది. హిందూపురం రైల్వేస్టేషన్ అంధకారంలో నెలకొంది. రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గరీబ్ రథ్ రైలు చాకర్లపల్లి రైల్వే స్టేషన్లో గంటన్నర పాటు నిలిచిపోయింది. కరెంటు వైర్లను మరమ్మత్తులు చేపట్టి, సాంకేతిక సమస్యను పరిష్కరించారు.

యశ్వంత్ పూర్ నుండి సికింద్రాబాద్ కు వెళ్లే రైలు సోమందేపల్లి మండలం రంగేపల్లి వద్ద రెండు గంటలుగా నిలిచిపోయింది. హిందూపురం రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ రైలు నిలిచిపోయింది. మలుగూరు రైల్వే స్టేషన్ లో బసవ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు.

Jyothi

Jyothi

Next Story