సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో కట్నం డబ్బుతో వరుడు పరారీ

చిమ్నాపూర్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయం పెళ్ళికి అన్నీ సిద్దం చేసుకున్న అమ్మాయి తరపు బంధువులు

Sandeep Reddy
Updated on: 16 Dec 2021 2:53 PM IST
Bride Groom Escapes With Dowry Money in Malkapur Sangareddy District
X

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో కట్నం డబ్బుతో వరుడు పరారీ

Sangareddy: పెళ్ళంటే ఆ సందడే వేరు. బంధువులు,స్నేహితుల రాకతో ఇళ్ళంతా కళకళలాడుతూ ఉంటుంది. మరికొద్ది గంటల్లో పెళ్లి.. అబ్బాయి, అమ్మాయి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారంటే ఆసందడి ఎలా ఉంటుందో ఇక చెప్పనక్కర్లేదు. ఒకవైపు పెళ్లి కూతురును చేస్తున్నారు.., మరోవైపు పెళ్లి పందిరి రెడీ అవుతోంది. ఇక పెళ్ళి కొడుకును తీసుకొచ్చేందుకు అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్ళారు. తీరా అక్కడి సీన్ చూసి షాక్ అయ్యారు.ఇంటికి తాళం వేసి పెళ్ళి కొడుకు,ఇంట్లో వాళ్ళందరు పరారయ్యారు. ఖంగుతిన్న అమ్మాయి బంధువులు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కంది మండలం చిమ్నాపూర్‌కు చెందిన ఓ యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన మాణిక్ రెడ్డితో పెళ్లి నిశ్చయమైంది. ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేశారు. 25 లక్షల రూపాయలు, 25 తులాల బంగారు కట్నం కింద ఇచ్చారు. ఈనెల 12న సంగారెడ్డిలో పెళ్లి అనుకున్నారు. పెళ్ళికి అన్నీ సిద్దం చేసారు. అబ్బాయి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఖంగుతిని వెనుతిరిగారు. కట్నం తీసుకుని పారిపోయిన మాణిక్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై సంగారెడ్డి రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story