కాసేపట్లో పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్.. ఎక్కడంటే..?

కాసేపట్లో పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్.. ఎక్కడంటే..?

Arun Chilukuri
Published on: 8 May 2023 12:26 PM IST
Bride elopes with sisters husband hours before wedding
X

కాసేపట్లో పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్.. ఎక్కడంటే..?

Bride Elopes: తాళి కట్టే సమయం..పెళ్లి పీటల పై నుంచి వరుడు పరార్..లేదంటే వధువు పరార్..ఇలాంటి వార్తలు మనం తరచుగా వింటుంటాం..పెళ్లి నచ్చలేదని ప్రేమించిన ప్రియుడితో కలిసి వధువు లేచిపోవడం...లేదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక మనసిచ్చిన నెచ్చెలితోనే జీవితం గడపాలని వరుడు జంప్ అవ్వడం...ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇంచుమించు ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగింది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి అనగా వధువు పారిపోయింది.

అయితే ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు కానీ..ఆమె తన సొంత అక్క భర్తను తీసుకొని పరారవ్వడమే అందరిని షాక్ కు గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కన్నాపూర్ కు చెందిన యువతికి లంబాడపల్లికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లికి అంతా సిద్ధం అయింది. ఇరు కుటుంబాల బంధువుల రాకతో పెళ్లి మండపం సందడిగా ఉంది. పెళ్లి మండపం పై పెళ్లికూతుర్ని తీసుకురావాల్సిన సమయం వచ్చింది.

పెళ్లి కూతురు కోసం చూస్తే కనిపించలేదు. ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. అయితే, ఇదే సమయంలో పెళ్లికూతురి అక్క భర్త అంటే బావ కూడా కనిపించడం లేదని బంధువులు గుర్తించారు. దీంతో ఇద్దరు కలిసి పరారయ్యారని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న వరుడు బంధువులు పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కూతురు పరారవ్వడం తెలుసు కానీ, ఇలా అక్క భర్తతోనే జంప్ అవ్వడం ఏంటని పెళ్లికి వచ్చిన వారు నోరెళ్లబెట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story