Breaking News to Unemployed Youth from Telangana Govt: నిరుద్యోగులకు తెలంగాణా ప్రభుత్వ ఉచిత శిక్షణ

Breaking News to Unemployed Youth from Telangana Govt: నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

K V D Varma
Published on: 15 July 2020 8:41 AM IST
Breaking News to Unemployed Youth from Telangana Govt: నిరుద్యోగులకు తెలంగాణా ప్రభుత్వ ఉచిత శిక్షణ
X
Representational image

తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెచ్చింది. ఉద్యోగార్ధులకు అన్ లైన్ లో ఉచితంగా కోచింగ్ ఇవ్వడాని రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (TASK), ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ కోర్స్ ఎరా తో ఒప్పందం కుదుర్చుకుంది.

డాటా సైన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఎల్ వంటి ఆన్లైన్ కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచితం శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కోర్సు పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లను ఇస్తారు. ఈ శిక్షణ తీసుకోవాలని ఉత్సాహం, ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 30వ తేదీ లోగా TASK వెబ్ సైట్ లో ఎన్రోల్ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి: https://www.task.telangana.gov.in

K V D Varma

K V D Varma

Next Story