కాసేపట్లో కాంగ్రెస్‌ నేతల బ్రేక్‌ ఫాస్ట్‌ మీట్

Congress Breakfast Meeting: జానారెడ్డి ఇంట్లో భేటీ కానున్న కాంగ్రెస్ నేతలు

Sriveni Erugu
Published on: 10 July 2022 9:34 AM IST
Breakfast meeting of Congress leaders in a while
X

కాసేపట్లో కాంగ్రెస్‌ నేతల బ్రేక్‌ ఫాస్ట్‌ మీట్

Congress Breakfast Meeting: తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు ట్రీట్ల మీట్స్ మొదలుపెట్టారు. కాసేపట్లో కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి నివాసంలో బ్రేక్‌ ఫాస్ట్‌ మీట్‌కు హాజరుకానున్నారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లుహాజరుకానున్నారు. ఇక మధ్యాహ్నం కోమటిరెడ్డి ఇంట్లో లంచ్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ లంచ్ మీట్‌లో షర్మిల పార్టీ అంశంపై చర్చించనున్నారు. వైఎస్‌ అభిమానులు షర్మిల పార్టీలోకి వెళ్తున్నారని నివేదిక అందింది. ఈ మేరకు షర్మిల పార్టీ అంశంపై చర్చించనున్నారు.

ఇక రాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ కు కాంగ్రెస్‌ నేతలు హాజరు కానున్నారు. పీసీసీ కార్యవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా డిన్నర్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో జరిగే ఈ విందుకు కాంగ్రెస్ నేతలు, సీనియర్లు హాజరుకానున్నారు. పార్టీలో అంతర్గత గొడవలకు చెక్‌ పెట్టడంపై ఈ డిన్నర్‌మీట్‌లో చర్చించనున్నారు. అలాగే పార్టీ బలోపేతం, చేరికలు, రాహుల్ పర్యటన అంశాలపై చర్చించనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story