టీపీసీసీ చీఫ్ ప్రకటనకు బ్రేక్

టీపీసీసీ చీఫ్ ప్రకటనకు బ్రేక్
x
Highlights

* ఆఖరి నిమిషంలో ఆగిపోయిన ప్రకటన * రాహుల్‌తో జానారెడ్డి ఏం మాట్లాడారు..? * నాగార్జునసాగర్ బై పోల్ తర్వాతే ప్రకటిస్తారా..?

టీ పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ఉత్కంఠగా మరింది. కొత్త సారధి ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందని వార్తలు వచ్చాయి. అంతలోనే సీనియర్ల అసంతృప్తితో హైకమాండ్ వెనక్కి వెళ్లింది. అయితే ఆ తర్వాత జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఒక ప్రకటనే మిగిలిందన్న వార్తలు గాంధీ భవన్ చుట్టు చక్కర్లు కొట్టాయి. అంతలోనే మళ్లీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది.

త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండడంతో పీసీసీ ఎంపిక వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త సారథిగా ఎవరు వచ్చిన ఆ ఎఫెక్ట్ సాగర్ ఉప ఎన్నికల్లో పడుతుందని అందుకోసం మరికొంత కాలం వాయిదా వేయాలని జానారెడ్డి హైకమాండ్‌కి ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారని హైకమాండ్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం పీసీసీ ఎంపిక పంచయితీ సోనియా గాంధీ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories