Bhupalpally: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2024 11:01 AM IST
Boy spotted in girls hostel in Bhupalpally
X

Bhupalpally: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో యువకుడు హాస్టల్‌లోకి వెళ్లి.. కాసేపు తర్వాత తిరిగి వెళ్లిపోవడం.. బాలికల హాస్టల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై హాస్టల్ ఇంచార్జ్ సోమలత చిట్యాలపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే... అర్ధరాత్రి పూట ఓ యువకుడు బాలికల హాస్టల్‌లోకి వెళ్తుంటే.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకుని... సంబంధిత సిబ్బందిపై, హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story