Reliance Smart: ఫీర్జాదిగూడలో దారుణం.. బల్లి పడ్డ మిల్క్ షేక్ తాగి బాలుడి పరిస్థితి విషమం

Reliance Smart: హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది.

Arun Chilukuri
Updated on: 30 May 2022 3:39 PM IST
Boy Drinks Lizard Mixed milkshake, Situation Critical
X

Reliance Smart: ఫీర్జాదిగూడలో దారుణం.. బల్లి పడ్డ మిల్క్ షేక్ తాగి బాలుడి పరిస్థితి విషమం

Reliance Smart: హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. బల్లి పడ్డ మిల్క్ షేక్ తాగి ఓ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఫీర్జాదిగూడలోని రిలయన్స్ స్మార్ట్ స్టోర్‌లో మూడు రోజుల క్రితం అవేంజర్ డెలాయిట్ మిల్క్ షేక్ డబ్బాలో బల్లి వచ్చింది. ఆ మిల్క్ షేక్ తాగిన సాహర్ధ అనే 9ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాబును తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. బాబును మూడు రోజుల పాటు ఐసీయూ ఉంచి చికిత్స అందించారు. ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ కడుపులో నొప్పి అంటూ చెబుతున్నాడు. మరికొన్ని రోజులు మందులు వాడాలని డాక్టర్లు చెప్పారు.

ఎప్పుడు ఏమి జరుగుతోందనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ స్టోర్ కు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు కంపెనీ వాళ్లను అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. రిలయన్స్ స్మార్ట్ స్టోర్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీతో పాటు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టోర్ మేనేజర్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story