తండ్రిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు

Sircilla: తాగి అమ్మను కొడుతున్నాడని ఫిర్యాదు

Jyothi
Published on: 26 Aug 2022 7:46 AM IST
Boy Complaint To The Police Against His Father
X

తండ్రిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు

Sircilla: మద్యం మత్తులో తల్లిని కొడుతున్న తండ్రి నిర్వాకాన్ని చూసి బాలుడు తల్లడిల్లిపోయాడు. 100కు డయల్ చేసి ... కిలో మీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి తల్లిని నిత్యం కొడుతున్నాడంటూ మూడో తరగతి చదువుతున్న జంగం భరత్ పోలీసులను ఆశ్రయించాడు. భరత్ తండ్రి బాలకిషన్ ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. డ్రైవర్ పని మానేసిన బాలకిషన్ కూలీ పని చేసే భార్య దీపిక సంపాదించిన డబ్బుల కోసం ఆమెను చితకబాదుతున్నాడు. డబ్బులు లాక్కొని మద్యం సేవిస్తూ నిత్యం తల్లిని కొడుతున్నాడు. అడ్డు వెళ్తున్న భరత్‌ను అతడి చెల్లెలును కూడా తండ్రి కొడుతున్నాడు. తండ్రి వేధింపులపై విసిగిపోయిన ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Jyothi

Jyothi

Next Story