అఖిల ప్రియను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. కిడ్నాప్ కేసు వివరాలపై కూపీ లాగుతున్న..

X
Highlights
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిల ప్రియను పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ...
Arun Chilukuri11 Jan 2021 4:00 PM GMT
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిల ప్రియను పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించి సేకరించిన ఆధారాలపై అఖిలప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కిడ్నాప్ కోసం ఉపయోగించిన సిమ్ కార్డ్స్, ఫోన్ కాల్స్ పై ఆరాతీస్తున్నారు. తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో వెల్లడించాలన్నారు. అఖిలప్రియ విచారణ మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. మూడు రోజుల పాటు మహిళా పోలీస్ స్టేషన్ లోనే విచారించనున్నారు పోలీసులు. కస్టడీకి తీసుకునే ముందు అఖిల ప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. మహిళ పోలీస్ స్టేషన్లో విచారించనున్న పోలీసులు.
Web TitleBowenpally kidnap case: Bhuma Akhila Priya remanded to three-day custody
Next Story