అఖిలప్రియకు చుక్కెదురు.. ఇక క్వశ్చన్ అవర్

Bowenpally kidnap case: Bhuma Akhila Priya remanded to three-day custody
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అఖిలప్రియకు సికింద్రాబాద్‌ కోర్ట్‌ బెయిల్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అఖిలప్రియకు సికింద్రాబాద్‌ కోర్ట్‌ బెయిల్ నిరాకరించింది. భూమా అఖిలప్రియకు కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ మధ్యాహ్నం వరకు కస్టడీ ఇచ్చింది. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జైల్‌ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. మరోవైపు ఈ కేసులో లోతుగా విచారించేందుకు అఖిలప్రియను కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అనుమతిచ్చింది. అయితే 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అడగ్గా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి 13 వరకూ అఖిలప్రియను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories