Ashada Bonalu 2023: నేటి నుంచి తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభం.. తొలి బోనం గోల్కొండ అమ్మవారికే..

Bonalu festival begins in Telangana from today
x

Ashada Bonalu 2023: నేటి నుంచి తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభం.. తొలి బోనం గోల్కొండ అమ్మవారికే..

Highlights

Bonalu: అమ్మవారి బోనాల సందడి ప్రారంభం

Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలు కానుంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే బోనాల పండగను.. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. అయితే బోనాల ఉత్సవాలతో నెల రోజుల పాటు జాతర కొనసాగుతుంది.

ఇక, ఇవాళ మొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, బోనాలకు లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories