టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

గన్‌పార్క్ నుంచి గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Sept 2024 7:56 AM IST
Bomma mahesh kumar goud will take charge as the new chief of TPCC
X

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ నూతన చీఫ్‌గా మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఇవాళ గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం గాంధీభవన్‌కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం గాంధీభవన్‌కు చేరుకోనున్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. ప్రత్యేక పూజలు నిర్వహించి... అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరా భవన్‌ ముందు సభ జరగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story