Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:22 PM IST
Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
X

Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌తో పాటు ఇతర భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేశాయి. వరుస మెయిల్స్ నేపథ్యంలో శంషాబద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు దృష్టి సారించారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28 బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంపై ఫోకస్ చేశారు. ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్ అన్నింటినీ కూడా డార్క్ వెబ్‌ను ఉపయోగించి దుండగులు పంపిస్తున్నట్లుగా నిర్ధారించారు. దీంతో ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్‌పై నమోదైన కేసులను సైబర్‌ క్రైమ్ విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story