చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ : రూ.7లక్షల సాయం చేసిన సోనూసూద్

చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ : రూ.7లక్షల సాయం చేసిన సోనూసూద్
x
Highlights

కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూసూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కావాలని ఎవరైనా కోరితే క్షణం కూడా ఆలోచించడం లేదు.

కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూసూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కావాలని ఎవరైనా కోరితే క్షణం కూడా ఆలోచించడం లేదు. సాయం చేయడంలో తన చేతికి ఎముకే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు నటుడు సోనూసూద్.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లె గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల నాలుగు నెలల కుమారుడు అద్విత్ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా.. వెంటనే సర్జరీ చేయాలని, 7లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు..

కూలి పని చేసుకునే తన దగ్గర అంత డబ్బు లేదని కొడుకును తీసుకుని సొంతూరికి తీసుకుని వెళ్లారు. దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో యాక్టర్ సోనూసూద్ స్పందించారు. వేములవాడ టీఆర్కే ట్రస్ట్‌ సాయంతో సోనూసూద్ విషయం తెలుసుకుని ఆపరేషన్‌ కు అయ్యే ఖర్చులు భరిస్తామని భరోసా ఇచ్చారు. దాంతో హైదరాబాద్ లో హార్ట్ ఆపరేషన్ చేయించారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడిన టీఆర్కే ట్రస్ట్, సోనూసూద్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలిపని చేస్తే తప్ప పొట్టగడవని ఆ నిరుపేద దంపతులు వైద్యులు చెప్పింది విని బావురుమన్నారు. తమ కన్నబిడ్డను కాపాడాలని కనిపించినవారినల్లా వేడుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories