Vinod Kumar: ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా..?

Boinapally Vinod Kumar Said That False Accusations Are Being Made Against Him Politically Boinapally Vinod Kumar
x

Vinod Kumar: ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా..?

Highlights

Vinod Kumar: నా 22 ఏళ్ల రాజకీయంలో నేనేనాడు తప్పులను ప్రోత్సహించలేదు.. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను

Vinod Kumar: తన బంధువుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారని తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు.. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశాయని, ఇంటిపేరు ఒకటైతే బంధువులవుతారా..? అంటూ వినోద్‌ కుమార్‌ ప్రశ్నించారు. అలాగైతే ప్రధాని మోడీ, నీరవ్ మోడీ బంధువులా..? అంటూ నిలదీశారు. తన 22 ఏళ్ల రాజకీయంలో తానేనాడు తప్పులను ప్రోత్సహించలేదని, చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పనని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. బండి సంజయ్‌ తనపై బీజేపీ కార్యకర్తలతో దుష్ప్రచారం చేస్తు్న్నారని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. గోబెల్స్‌ ప్రచారం ఆపాలని, ఆ అమ్మాయి తన బంధువు అని రుజువు చేయగలరా..? అంటూ బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు వినోద్‌ కుమార్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories