లిక్కర్‌ స్కాంలో బోయినపల్లి అభిషేక్ కస్టడీ పొడిగింపు

*అభిషేక్‌కు మరో రెండు రోజుల కస్టడీ విధించిన కోర్టు

Rama Rao
Published on: 13 Oct 2022 7:35 PM IST
Boinapally Abhishek Rao Custody Extension in Liquor Scam Case
X

లిక్కర్‌ స్కాంలో బోయినపల్లి అభిషేక్ కస్టడీ పొడిగింపు

Liquor Scam Case: లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌ కస్టడీని కోర్టు పొడిగించింది. అభిషేక్‌కు ప్రత్యేక కోర్టు మరో రెండు రోజులు కస్టడీ విధించింది. లిక్కర్ స్కాంలో అభిషేక్ పాత్రపై విచారించేందుకు సీబీఐ మరో రెండు రోజుల సమయం కోరింది. దీంతో కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్ళైకి నోటీసులు ఇచ్చామని మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

ఇదే కేసులో అరుణ్ రామచంద్ర పిళ్ళై.. గౌతమ్‌తో ఉన్న సంబంధాలపై విచారించేందుకు రెండు రోజుల కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. గడిచిన రెండు రోజులుగా కస్టడీ విచారణ పేరుతో ఒరిగిందేమి లేదని అభిషేక్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ కస్టడీలో ఉంచి విచారణ చేయాల్సిన అవసరం లేదని దర్యాప్తునకు అభిషేక్ సహకరిస్తాడని న్యాయవాది తెలిపారు. అభిషేక్ తరఫు న్యాయవాది వాదనలను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

Rama Rao

Rama Rao

Next Story