తీన్మార్‌ మల్లన్నపై బోధన్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Shakeel: తీన్మార్‌ మల్లన్నపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 8:57 PM IST
Bodhan MLA Shakeel Warns Teenmar Mallanna
X

తీన్మార్‌ మల్లన్నపై బోధన్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Shakeel: తీన్మార్‌ మల్లన్నపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే మూడు ముక్కలుగా నరికేస్తామన్నారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన మల్లన్నపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తీన్మార్‌ మల్లన్నను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు ఎమ్మెల్యే షకీల్‌.

ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రి కేటీఆర్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని షకీల్ అన్నారు. మూడు కాదు 300 ముక్కలుగా నరికేస్తామని ఆయన మండిపడ్డారు. హిమాన్షు గురించి మాట్లాడడమేంటని ఆయన ప్రశ్నించారు. మోసగాళ్లను, చీటర్లను పార్టీలో చేర్చుకుని బీజేపీ ఇదే నేర్పిస్తుందా? అని నిలదీశారు. మరోమారు సీఎం కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తానే ఇంటికొచ్చి కొడతానని షకీల్ వార్నింగ్ ఇచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story