ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్యే షకీల్ ఫైర్

Arun Chilukuri
Updated on: 23 Feb 2021 6:30 PM IST
ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్యే షకీల్ ఫైర్
X

ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్యే షకీల్ ఫైర్

దొంగ పాస్ పోర్టు వ్యవహారంలో రాజకీయం చేయడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ మానుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విదేశీయులు దేశంలోకి చొరబడుతున్నారని.. దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని.. నీ తండ్రి డీఎస్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నోరు ఉంది కదా అని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరని ఆయన పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఎంపీ అర్వింద్‌కు షకీల్ సూచించారు. అర్వింద్ మళ్ళీ ఎంపీగా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story